కామారెడ్డి బస్ స్టాండ్ సొగసు చూడతరమా... వామ్మో కుంట

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్ దుస్థితి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. చిన్నపాటి వర్షానికే బస్ స్టాండ్ ప్రాంగణం నీటితో నిండి కుంటలా మారుతోంది. బస్సులు కదిలినప్పుడు నీరు ప్రయాణికులపై పడుతోంది. ప్లాట్‌ఫారాలపై నిలిచిన నీరు దుర్గంధాన్ని వెదజల్లుతూ దోమల బెడదను పెంచుతోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై దృష్టి సారించడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్