లింగంపేట మండల విశ్వబ్రాహ్మణ సంఘం కార్యవర్గాన్ని బుధవారం ఆయా గ్రామాల ప్రతినిధుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమ్మరి సిద్ధరాములు చారి (కొండాపూర్) మండల అధ్యక్షుడిగా, కమ్మరి వెంకట్ చారి ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వడ్ల భీమయ్య చారి, పండరి చారి, నరహరి చారి, చంద్రశేఖర్ చారి, మురళి చారి, వెంకటేశం చారి, ఏగొండ చారి, ప్రభాకర్ చారి, లక్ష్మీనారాయణ చారి, బ్రహ్మం చారి, సతీష్ చారి తదితరులు పాల్గొన్నారు.