పెండింగ్ దరఖాస్తులు జూన్ 4లోగా పూర్తిచేయాలి: కలెక్టర్

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, భూ భారతి, రెవెన్యూ సదస్సులకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పరిశీలించి, జూన్ 4లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గడువులోగా పనులు పూర్తి కాకపోతే, సంబంధిత అధికారులు జూన్ 5, 6 తేదీల్లో కలెక్టరేట్‌లో హాజరై దరఖాస్తుల పరిష్కారం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. సాదాబైనామా దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను కూడా నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్