ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన 101 దరఖాస్తులు స్వీకరణ

ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కలెక్టరేట్ లో ప్రజల నుంచి వివిధ శాఖలకు సంబంధించిన 101 దరఖాస్తులను స్వీకరించారు. భూ సమస్యలు, విద్య, రెవెన్యూ, పింఛన్లు, సంక్షేమ పథకాలు, గృహాలు, ఉపాధి, విద్యుత్, మున్సిపల్, వ్యవసాయం వంటి అంశాలపై ప్రజలు వినతులు సమర్పించారు. ప్రతి దరఖాస్తును అధికారులు పరిశీలించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్