కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శుక్రవారం రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా కరపత్రాలు, పోస్టర్లను ఆవిష్కరించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ట్రాఫిక్ నియమాలను తప్పక పాటించాలని ఆయన సూచించారు. పాఠశాల విద్యార్థులకు రహదారి నియమాలపై అవగాహన కల్పించాలని రవాణా శాఖకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కే నరసింహారెడ్డి, జిల్లా రవాణా అధికారి జే. శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.