సర్దార్ సర్వాయి పాపన్న పోరాటం ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకం

కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. ఆయన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, ధైర్యసాహసాలు, సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ కొనియాడారు. సామాజిక న్యాయం, సమసమానత్వం కోసం ఆయన అహర్నిశలు కృషి చేశారని తెలిపారు. అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమొహాన్, జిల్లా అధికారులు, సిబ్బంది కూడా పాపన్న సేవలను స్మరించుకున్నారు.

సంబంధిత పోస్ట్