కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల తనిఖీ చేసిన సర్పంచ్

ఎల్లారెడ్డి సెగ్మెంట్ రామారెడ్డిలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో రామారెడ్డి గ్రామ సర్పంచ్ బండి ప్రవీణ్ క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. విద్యార్థినుల భోజనం, విద్యా నాణ్యత, ఆరోగ్యం, సౌకర్యాలపై ఆయన సమగ్ర పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, వంటశాల, పాత్రలు పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థినులకు అధిక నాణ్యతతో కూడిన భోజనం అందించాలని సూచించారు. భోజనంలో నాణ్యత లోపిస్తే సహించేది లేదని హెచ్చరించారు. పదో తరగతి ఉత్తీర్ణత శాతం పెరిగేలా బోధన ఉండాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్