పారదర్శకమైన ఓటర్ జాబితా తయారీ కోసమే "సర్"

కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్, ఆర్డీఓ ఆర్. ప్రభాకర్ తో కలిసి శుక్రవారం ఎల్లారెడ్డి ఆర్డీఓ కార్యాలయంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు. పారదర్శకమైన, ఖచ్చితమైన ఓటరు జాబితా తయారీ లక్ష్యంగా ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎఓ అనిల్, ఎన్నికల శాఖ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్