మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ

కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర బుధవారం రాత్రి మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందితో సమావేశమై విధుల నిర్వహణ, శాంతిభద్రతలు, నేర నియంత్రణ చర్యలపై సమీక్షించారు. అనుమానితుల కదలికలపై నిఘా, బాధితులతో గౌరవంగా వ్యవహరించడం, ముందస్తు సమాచారం సేకరణ, డయల్-100 కాల్స్‌కు తక్షణ స్పందన వంటి అంశాలపై ఆయన ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్