పారిశుద్ధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ: మున్సిపల్ కమిషనర్

ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ తెలిపారు. శనివారం, కమిషనర్ ఆదేశాల మేరకు మున్సిపల్ మేనేజర్ వాసంతి, 5, 6, 9, 11, 12 వార్డుల్లో అధికారులతో కలిసి పర్యటించి, మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి, పిచ్చి మొక్కలను తొలగింపజేశారు. ఈ చర్యల ద్వారా వార్డుల్లో మెరుగైన పారిశుద్ధ్యం నెలకొల్పేందుకు కృషి జరుగుతోంది.

సంబంధిత పోస్ట్