గ్రామాల్లో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి: జిల్లా కలెక్టర్

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం తాడ్వాయి మండలం ఏండ్రియాల్ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో తాగునీటి వనరులు, మౌలిక సదుపాయాలను పరిశీలించి, అధికారుల నుండి వివరాలు తెలుసుకున్నారు. గ్రామంలో 3 మంచి నీటి ట్యాంకులు, 4 బోరు బావులు, పంప్ సెట్లు, 396 ఇంటింటి నల్లా కనెక్షన్లు ఉన్నాయని అధికారులు వివరించారు. మిషన్ భగీరథ పథకం కింద తాగునీటి సరఫరా గురించి ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్