పారదర్శక బదిలీలు బాధ్యతాయుత విధులకు పునాది: జిల్లా ఎస్పీ

కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పారదర్శక బదిలీలు బాధ్యతాయుత విధులకు పునాది అని అన్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ సబ్ డివిజన్ల పోలీసులతో జరిగిన సమావేశంలో 8 మంది ఏఎస్సైలు, 18 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 111 మంది కానిస్టేబుళ్లు, 9 మంది ఎంటీ సెక్షన్ సిబ్బందిని ఆయన బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్సైలు క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీతో విధులు నిర్వహించాలని, ప్రజలకు విశ్వాసం కలిగించేలా నైపుణ్యాన్ని మెరుగుపరచుకొని, నైతికతతో ఉత్తమ సేవలు అందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్