ఎల్లారెడ్డి మండల ఎంపీడీఓ (గ్రూవ్ -1 ఆఫీసర్)గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తాయారా బేగం గురువారం అన్నాసాగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పరిశీలనకు వెళ్లారు. కొత్త ఎంపీడీఓను గ్రామస్తులు, అక్కడి నాయకులు ఘనంగా స్వాగతించి జీపీ కార్యాలయంలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఈ రామాగౌడ్, జే. గురుప్రతాప్, ఎంపీఓ ప్రకాష్, కార్యదర్శి సలీం, కారోబార్ సంగారెడ్డి, సీసీ ఆంజనేయులు, ఫీల్డ్ మాన్ లక్ష్మణ్, కమిటీ సభ్యుడు మల్లయ్య, సంజీవులు, ప్రజలు పాల్గొన్నారు.