బోయినపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో శనివారం ఎస్సై రమాకాంత్ ఆధ్వర్యంలో శ్రమదానం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను శుభ్రం చేసి పిచ్చి మొక్కలను తొలగించారు. జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సైతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.