ధర్మపురిలో గంజాయి, మాదకద్రవ్యాలపై పోలీసుల ప్రత్యేక తనిఖీలు

జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం పోలీసులు శుక్రవారం ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. సీఐ రాంనరసింహరెడ్డి, ఎస్ఐ జి. మహేష్ ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ బృందాలు కాలేజీ పరిసరాలు, టిఫిన్ సెంటర్లు, పాన్ షాపులు, బస్టాండ్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాయి. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గంజాయి విక్రయాలు, వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సీఐ సూచించారు.

సంబంధిత పోస్ట్