సంక్రాంతి పండుగ సందర్భంగా నిషేధిత చైనా మాంజాను విక్రయించినా లేదా ఉపయోగించినా కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం హెచ్చరించారు. నైలాన్ దారాల వల్ల పక్షులు, వాహనదారులకు ప్రాణాపాయం ఉందని, వీటిపై నిఘా కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు కేవలం కాటన్ దారాలనే వాడి, సురక్షితంగా పండుగ జరుపుకోవాలని ఆయన కోరారు.