సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు, పెట్టుబడి మోసాలు, స్క్రీన్ షేరింగ్ యాప్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ సూచించారు. నవంబర్ నెల మొత్తం “YOUR MONEY, YOUR CLICK, YOUR CHOICE” నినాదంతో జిల్లా వ్యాప్తంగా సైబర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. ఓటీపీ, యూపీఐ పిన్ వివరాలు ఎవరికీ చెప్పవద్దని, సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕