జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపెల్లి గ్రామానికి చెందిన చెవులమద్ది శ్రీనివాస్ అలియాస్ మిలిటరీ శీను, ఇండియన్ ఆర్మీలో 17 ఏళ్లు హవల్దార్ హోదాలో సేవలందించి పదవీ విరమణ పొందారు. దేశ రక్షణలో కీలక పాత్ర పోషించిన ఆయన, ఇప్పుడు తన గ్రామంలోని ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు.