అన్నపూర్ణ రిజర్వాయర్‌ను సందర్శించిన కలెక్టర్, ఎస్పీ

బుధవారం ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామ శివారులోని అన్నపూర్ణ రిజర్వాయర్‌ను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే సందర్శించారు. రిజర్వాయర్ సామర్థ్యం, నీటి నిల్వ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు అనంతగిరి పోచమ్మ ఆలయంలో పూజలు చేసి, ఆలయ చరిత్ర, ప్రాముఖ్యతపై ఆరా తీశారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ సమర్థవంతంగా చేపట్టాలని పంచాయతీ కార్యదర్శికి కలెక్టర్ సూచించారు.

సంబంధిత పోస్ట్