ఇల్లంతకుంట మండలం వెల్జీపురం గ్రామంలో పదో వార్డులో లోవోల్టేజ్ సమస్యను పరిష్కరించడానికి సెస్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి సహకారంతో, సెస్ అధికారుల పర్యవేక్షణలో సింగిల్ పేజ్ బుడ్డిని అమర్చారు. ఈ చర్యతో లోవోల్టేజ్ సమస్య అధిగమించబడింది. ఈ సందర్భంగా సెస్ ఏఈ, లైన్ ఇన్స్పెక్టర్ రాజేశంలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాయిని నవీన్ కుమార్, పదవ వార్డ్ మెంబర్ బొల్లారం ప్రసన్నకుమార్, సెస్ ప్రతినిధి జుర్ర రాజయ్య, సెస్ అసిస్టెంట్ హెల్పర్ నరేష్, జిపి హెల్పర్ దూడం కిషోర్, ఎనుగుల ఎల్లయ్య, కేశిరెడ్డి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.