ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌ను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ క్లాస్‌లో విద్యార్థులతో కలిసి పాఠం విని, వారిని ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. డైనింగ్ హాల్‌లో మెనూ, ఆహార పదార్థాలు పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని ఆరా తీసి, ప్రణాళిక ప్రకారం చదవాలని, లైబ్రరీలో పుస్తకాలు, దినపత్రికలు చదవాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఫాతిమా, ఎంపీడీవో సత్తయ్య కూడా ఉన్నారు.