ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 5న కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్ లో నిర్వహించనున్న బహిరంగ సభకు సంబంధించిన సభా స్థలిని సీఐ ప్రమోద్ కుమార్, ఎస్ ఐ నరేష్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. స్థానిక సర్పంచ్ లింగాల ఆనంద్, ఉప సర్పంచ్ ఇనుగొండ రమణ రెడ్డితో కలిసి గ్రామంలో పర్యటించి, సభా వేదిక, ప్రాంగణం, పరిసర ప్రాంతాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా గ్రామాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.