పెద్దపల్లి: ఆగస్టు మాసం వరకు సరిపడా యూరియా నిల్వలు: కలెక్టర్

పెద్దపల్లి జిల్లాలో ప్రస్తుతం 9400 టన్నుల యూరియా అందుబాటులో ఉందని, ఆగస్టు మాసంలో 10వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని, ప్రస్తుతం యూరియా నిల్వలు ఆగస్టు మాసం వరకు సరిపోతాయని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి సోమవారం ప్రకటనలో తెలిపారు. ఆగస్టులో కూడా యూరియా సప్లై ఉంటుంది కాబట్టి రైతులు ఆందోళన చెంది యూరియాని ప్రస్తుతం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదన్నారు.

సంబంధిత పోస్ట్