ఆగస్టు 10 నాటికి అభివృద్ధి పనులు ప్రారంభించాలి: పెద్దపల్లి కలెక్టర్

ఆగస్టు 10 నాటికి జిల్లాలో ప్రతి పంచాయతీ రాజ్ ఏఈ పరిధిలో మంజూరు చేసిన అభివృద్ధి పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి కలెక్టరేట్ లో బుధవారం పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖపై సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ తరపున మంజూరు చేసిన అభివృద్ధి పనులు త్వరగా గ్రౌండ్ అయ్యేలా చూడాలని, అందుబాటులో ఉన్న నిధులను వినియోగించుకుంటూ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్