మొక్కలతోనే మానవాళికి ప్రాణ వాయువు అందుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పెద్దపల్లి పట్టణంలోని ఐటీఐ కళాశాలలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మొక్కలు నాటారు. మానవాళికి ప్రాణ వాయువు ప్రాణ వాయువును ఇచ్చే మొక్కలను విరివిగా నాటి సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.