యూరియా అక్రమంగా దాచిపెట్టిన రవాణా చేసిన కఠిన చర్యలు తప్పవు అని రుద్రంగి ఎస్సై శ్రీనివాస్ అన్నారు. చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని సూచించారు. రుద్రంగి పరిధిలోని మానాల క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ని తనిఖీ చేశారు. యూరియా అక్రమంగా దాచిపెట్టిన రవాణా చేసిన, బ్లాక్ మార్కెటింగ్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.