రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామ సర్పంచ్ అభ్యర్థి వెంకటేశంపై ఉన్న ఏడు కేసుల వివరాలను నామినేషన్ లో పొందుపరచలేదని మరో సర్పంచ్ అభ్యర్థి యామ రవీందర్ ఆరోపించారు. ఈ విషయంపై వేములవాడ ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందున వెంకటేశం నామినేషన్ ను రద్దు చేయాలని రవీందర్ కోరారు.