కేరళ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. బేవరేజస్ కార్పొరేషన్ ద్వారా ఏడాదికి 70 కోట్ల సీసాల మద్యం విక్రయిస్తోంది. కేవలం 56 కోట్ల బాటిళ్లు మాత్రమే రీసైకిల్ అవుతున్నాయి. మిగతావన్నీ వ్యర్థాలుగా మిగిలిపోతున్నాయి. దీనిని తగ్గించేందుకు ఇకపై ప్రతి మద్యం బాటిల్‌పై అదనంగా రూ.20 ముందస్తు డిపాజిట్ చేయనున్నట్లు ప్రకటించింది. మళ్లీ అదే బాటిల్‌ను తిరిగి ఇస్తే డిపాజిట్ సొమ్మును వెనక్కి ఇవ్వనున్నట్లు తెలిపింది.