కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 ఏప్రిల్ 1 నుండి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఆదాయపు పన్ను చట్టంలో మార్పులు, రూ. 12 లక్షల వరకు పన్ను మినహాయింపు, ఫారం-16 స్థానంలో కొత్త ఫారాలు రానున్నాయి. పాన్ కార్డు కోసం ఆధార్‌ను పుట్టిన తేదీ రుజువుగా అంగీకరించరు. రైలు టికెట్ రద్దు నిబంధనలు సవరించారు. కొన్ని బ్యాంకులు ఏటీఎం, డెబిట్ కార్డు నిబంధనలను మార్చాయి. ఎల్‌పీజీ, సీఎన్‌జీ, విమాన ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంది.