జూలై 1 నుంచి కీలక మార్పులు.. పాస్‌పోర్ట్, రైల్వే ఫైన్లు, కార్ల ధరలు పెంపు

దేశంలో జులై 1 నుంచి పలు కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆధార్‌కార్డులో ఉచితంగా జీమెయిల్ అడ్రస్ మార్చుకునే అవకాశం డిసెంబర్ 31 వరకు ఉంది. పాస్‌పోర్ట్ ఫీజులు రూ.1,500 నుంచి రూ.2,500కు, తత్కాల్ పాస్‌పోర్ట్ ఫీజు రూ.3,500 నుంచి రూ.5,000కు పెరిగాయి. టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణిస్తే విధించే ఫైన్ రెట్టింపు అయింది. మహిళల కోచ్‌లో పురుషులు ప్రయాణిస్తే రూ.2,500 ఫైన్, అనుమతి లేకుండా వస్తువులు అమ్మితే రూ.2,000 ఫైన్ విధించనున్నారు. టాటా, ఎంజీ, కియా, బీఎండబ్ల్యూ కార్ల ధరలు కూడా పెరగనున్నాయి. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై జూన్‌లో విధించిన ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

సంబంధిత పోస్ట్