కేంద్ర కేబినేట్ కీలక నిర్ణయాలు

కేంద్ర కేబినెట్ బుధవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్ తయారీ పథకం కోసం రూ.2,280 కోట్లు కేటాయించింది. ఈ నిర్ణయం దేశీయంగా మాగ్నెట్ ఉత్పత్తిని ప్రోత్సహించనుంది. అలాగే, పూణే మెట్రో విస్తరణ ప్రాజెక్టుకు రూ.9858 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో మెట్రో మార్గాలను విస్తరించి, ప్రజా రవాణాను మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రెండు నిర్ణయాలు దేశ ఆర్థికాభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు దోహదపడతాయని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్