కొత్తగూడెం సింగరేణిలోని వివిధ ఏరియాల్లో విధులు నిర్వహిస్తున్న 36 మంది సర్వే అధికారులను బదిలీ చేస్తూ ఈఈ సెల్ విభాగాధిపతి ఎ. జె. మురళీధర్ రావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో ఏడుగురు సర్వే అధికారులు, 29 మంది జూనియర్ సర్వే అధికారులు ఉండగా, వీరంతా ఈనెల 21లోగా కేటాయించిన ఏరియాల్లో జాయిన్ కావాలని సూచించారు.