కొత్తగూడెం: ప్రజలు ఆందోళన చెందొద్దు: అదనపు కలెక్టర్

ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే మూడు నెలలకు సంబంధించిన రేషన్ కోటాను ఈ నెల 30వ తేదీ వరకు ఒకే సారి పంపిణీ చేయడం జరుగుతుందని, లబ్దిదారులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని కొత్తగూడెం అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సోమవారం ప్రకటనలో తెలిపారు. జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన బియ్యాన్ని చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ కార్డు లబ్ధిదారులు ఒకేసారి పొందవచ్చని అన్నారు. రేషన్ కార్డులు కలిగిన వారు ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపారు.

సంబంధిత పోస్ట్