బోనకల్- ఆళ్లపాడు రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నీరు నిల్వ ఉండటంతో రైతులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎండాకాలంలోనే బ్రిడ్జి కింద నీరు చేరి మట్టి, పాకుడు పేరుకుపోవడంతో ద్విచక్ర వాహనదారులు జారిపడుతున్నారని స్థానికులు తెలిపారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దిగజారి రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.