అనుమతులు లేని ఫెర్టిలైజర్స్‌ను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయ శాఖ అధికారి సరిత అన్నారు. గురువారం ముదిగొండ మండలం వనంవారికృష్ణాపురంలో ఎరువుల దుకాణాలను ఎస్సై హరితతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అనుమతులు లేని ఫెర్టిలైజర్స్‌ను వ్యవసాయ శాఖ అధికారి సీజ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎరువుల దుకాణదారులు తప్పనిసరిగా పాటించాలన్నారు.