బోనకల్ లో ఎంవీఐ కార్యాలయం ఏర్పాటెప్పుడో?

బోనకల్ లో మోటార్ వాహనాల తనిఖీ అధికారి (ఎంవీఐ) కార్యాలయం ఏర్పాటు ప్రక్రియ నిలిచిపోవడంతో స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలల క్రితం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు అధికారులు తహసీల్దార్ కార్యాలయం పరిధిలోని ఖాళీ స్థలాన్ని పరిశీలించినా, తదుపరి చర్యలు చేపట్టలేదు. మధిర, బోనకల్ ప్రాంతాల ప్రజలు వాహనాల పనుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితం కాకుండా త్వరగా కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్