కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే పేద ప్రజలకు ఆరోగ్య భరోసా

కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే పేద ప్రజలకు ఆరోగ్య భరోసా సాధ్యమవుతుందని ఖమ్మం రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు కల్లెం వెంకట్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు హరినాథబాబు పేర్కొన్నారు. ఖమ్మం రూరల్ మండలం సాయిగణేష్ నగర్ లోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సిఫారసుతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శుక్రవారం లబ్దిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పేద ప్రజలకు అందని చెక్కులను సైతం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని లబ్దిదారులకు వాటిని అందించేందుకు కృషిచేస్తున్నారన్నారు. మంత్రి పొంగులేటి చొరవతో రిలీఫ్ ఫండ్ చెక్కులతో పాటు ముందస్తుగా ఎల్ వో సీ లు కూడా మంజూరు అవుతున్నాయన్నారు. 55 మంది లబ్దిదారులకు సుమారు రూ. 22 లక్షల విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మద్ది వీరారెడ్డి, బోడా వెంకన్న, ఏనుగు వెంకట్ రెడ్డి, దండ్యాల బాబు, తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, వెంపటి రవి, అంబేడ్కర్, రానేరు మురళి, వెంకట నారాయణ, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్