రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపాలిటీల వారీగా ఓటర్ల జాబితా రూపకల్పన ప్రారంభమైంది. బుధవారం ఏదులాపురం మున్సిపాలిటీలో పోలింగ్ స్టేషన్లు, వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేస్తున్న తీరును అదనపు కలెక్టర్ పి. శ్రీజ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె వివరాలు తెలుసుకుని, ఎక్కడా తప్పులు లేకుండా జాబితా రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు.