కూసుమంచి: 'ప్రజా ఆరోగ్య సంరక్షణ కోసమే ప్రభుత్వ వైద్య కేంద్రాలు'

ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసమే ప్రభుత్వ వైద్య కేంద్రాలు పని చేస్తున్నాయని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. గురువారం కూసుమంచి మండలం కేంద్రంలోని ఆయుర్వేద, యునానీ, హోమియో ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓ. పి. సేవలు, మందుల అందుబాటు, సూచిక బోర్డు, వైద్య సేవలు, అపరేషన్ థియేటర్ పరిశీలించారు. డాక్టర్లు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్