మనిషికి చదువును మించిన ఆస్తి లేదని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. చదువుతోనే సొసైటీలో గౌరవం, ఉన్నత స్థాయి ఉంటుందని గురువారం కూసుమంచిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. విద్యార్థులు చక్కగా చదువుకొని ఐపీఎస్, ఐఏఎస్, డాక్టర్లు అవ్వాలని ఆకాంక్షించారు. తాను ఇప్పుడు జిల్లా కలెక్టర్ గా ఉన్నానంటే దానికి చదివే కారణమని పేర్కొన్నారు.