కూసుమంచి మండలం నరసింహులగూడెం గ్రామంలో శనివారం 'అరైవ్ అలైవ్' అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై నాగరాజు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని, హెల్మెట్, సీటుబెల్టు తప్పనిసరి అని సూచించారు. మద్యం సేవించి డ్రైవింగ్, అతివేగం, మొబైల్ వాడకం ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరిస్తూ, గ్రామస్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.