నేలకొండపల్లి: నామినేషన్ కేంద్రాలు పరిశీలించిన అదనపు కలెక్టర్

గ్రామపంచాయతీ నామినేషన్ల స్వీకరణ, పరిశీలన కార్యక్రమాలను అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ పర్యవేక్షించారు. నేలకొండపల్లి మండలం నేలకొండపల్లి, కోనాయిగూడెం, రాజేశ్వరపురంలో నామినేషన్ల స్వీకరణను పరిశీలించి, ఉద్యోగులకు సూచనలు చేశారు. చింతకాని మండలం నాగులవంచలో నామినేషన్ల పరిశీలనను పర్యవేక్షించిన శ్రీజ, ప్రతీ నామినేషన్ ను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్