నేలకొండపల్లి మండల పంచాయతీ అధికారి (ఎంపీవో) చిప్పా శివ మల్టీజోనల్ బదిలీల్లో భాగంగా ములుగు జిల్లా మంగపేట మండలానికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండల ఎంపీవోగా పనిచేస్తున్న ఎం. శ్రీనివాసరావు నేలకొండపల్లికి రానున్నారు. ఎంపీవో శివ నేలకొండపల్లి మండలంలో నాలుగు సంవత్సరాలు పాటు సుదీర్ఘంగా పనిచేశారు.