నేలకొండపల్లి: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేలకొండపల్లి మండలంలోని కొత్త కొత్తూరు, నేలకొండపల్లి పట్టణాలలో చెట్ల కొమ్మలను తొలగించే పనుల కారణంగా బుధవారం స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖాధికారి తెలిపారు. ఈ సమయంలో వినియోగదారులు విద్యుత్ సిబ్బందికి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్