నేలకొండపల్లి ఎస్సైగా పి. శ్రీనివాసరెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన స్థానంలో బోడు ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసరెడ్డిని నేలకొండపల్లికి బదిలీపై వచ్చారు. ఇంతకుముందు ఎస్సైగా పనిచేసిన సంతోష్ ఖమ్మంకు బదిలీ అయ్యారు. కొత్త ఎస్సై శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా సిబ్బంది, పలువురు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.