ఖమ్మం నగరాన్ని ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం మంత్రి నగరంలోని 18వ డివిజన్ లోని సీతారామ నగర్లో రూ. 135 లక్షల వ్యయంతో నిర్మించనున్న స్మార్ట్ వాటర్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు. నిర్మాణ పనులు నాణ్యతతో, నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు.