పారిశుద్ధ్య చర్యలు పకడ్బందీగా చేపట్టాలి

పారిశుద్ధ్య చర్యలు పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ అన్నారు. శుక్రవారం అదనపు కలెక్టర్, మధిర వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో మధిర నియోజకవర్గ మండలాల ఎంపిడిఓలు, ఎంపిఓలతో పారిశుద్ధ్యం పై సమావేశం నిర్వహించి, దిశానిర్దేశం చేశారు. సీజనల్ వ్యాధుల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్