మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం పాలేరు, అరెంపుల క్లస్టర్లలో 'ప్రజా దర్బార్' నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు పాలేరులో, మధ్యాహ్నం 3:30 గంటలకు అరెంపులలో జరిగే ఈ సభల్లో కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఇందిరమ్మ ఇళ్లు, భూ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించనున్నట్లు మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్ దయాకర్ రెడ్డి తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.