ఏదులాపురం: నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

ఖమ్మం రూరల్ మండల ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఏదులాపురం మున్సిపాలిటీ వార్డుల నామినేషన్ స్వీకరణ కేంద్రాలను గురువారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తనిఖీ చేశారు. అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ పత్రాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియపై సిబ్బందికి జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్