ఎలాంటి పొరపాట్లు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ ప్రసాద్ రావు సూచించారు. శుక్రవారం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గుదిమళ్ళ నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్త్ ఏర్పాట్లను ఆయన పరిశీలించి, ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ నామినేషన్ల ప్రక్రియ బందోబస్త్ పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.